ఈ నెల 29వ తేదీన ప్రత్యేకమైన ఖగోళ సంఘటన చోటుచేసుకోనుంది. అదే షష్ఠగ్రహ కూటమితో పాటు సూర్యగ్రహణం. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు దీనికి సంబంధించి అనేక విశ్లేషణలు అందిస్తున్నారు. కొందరి మాటల్లో ఇది భవిష్యత్‌ను ప్రభావితం చేసే సంఘటనగా చెబుతుంటే, మరికొందరు దీని నుంచి చిన్న పరిహారాలతో ఉపశమనం పొందవచ్చని అంటున్నారు.
సూర్యగ్రహణం వివరాలు:
మార్చి 29న మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:13 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి దేశంపై ప్రత్యక్ష ప్రభావం ఉండదు. అయితే కెనడా, పోర్చుగల్, స్పెయిన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, నార్వే, ఫిన్లాండ్, రష్యా వంటి దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.
షష్ఠగ్రహ కూటమి అంటే ఏంటి?
ఈ రోజు మీనరాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఇప్పటికే ఉంటాయి. వీటితో పాటు శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలసి ఉండడం చాలా అరుదు. దీనికితోడు అదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల కొన్ని రాశులపై దీని ప్రభావం మరింత పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఏ రాశులపై ఎలాంటి ప్రభావం? పరిహారాలు ఏమిటి?
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19):
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. తలనొప్పులు, కీళ్ల నొప్పులు, అనుకోని ఖర్చులు సంభవించొచ్చు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
పరిహారం: ఎర్ర పప్పు (మసూర్ దాల్) దానం చేయండి.
వృషభం (ఏప్రిల్ 20 – మే 20):
ఉద్యోగ, వ్యాపార రంగంలో చిన్న అడ్డంకులు, వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కానీ ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యలు అధిగమించవచ్చు.
పరిహారం: గాయత్రి మంత్రాన్ని పఠించండి.
మిథునం (మే 21 – జూన్ 20):
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. స్టార్టప్‌లకు ఇదే సరైన సమయం. కళారంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
పరిహారం: దుర్గా చాలీసా చదవండి.
కర్కాటకం (జూన్ 21 – జూలై 22):
వ్యక్తిగత, వృత్తిపరమైన మార్పులు జరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ మార్పుల అవకాశాలు బలంగా ఉన్నాయి. కుటుంబంలో బంధాలు మరింత బలపడతాయి.
పరిహారం: బియ్యం, చక్కెర, తెల్లటి దుస్తులు దానం చేయండి.
సింహం (జూలై 23 – ఆగస్టు 22):
కెరీర్లో సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిడులు ఎదురుకావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో విబేధాలు తలెత్తొచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
పరిహారం: గోధుమలు లేదా బెల్లం దానం చేయండి.
కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22):
ఉద్యోగావకాశాలు అందినా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. వ్యాపార లాభాల్లో స్థిరత్వం ఉండదు.
పరిహారం: గణేషా చాలీసా చదవండి, కూరగాయలు దానం చేయండి.
తులా (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22):
ప్రేమ సంబంధాలు బలపడతాయి. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు.
పరిహారం: లక్ష్మీదేవి అష్టోత్రం చదవండి.
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21):
జీవితం సాధారణంగా కొనసాగుతుంది. కానీ కొత్త అవకాశాలను వదులుకోవద్దు. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21):
ఆర్థిక ఒత్తిడి, కార్యాలయంలో విబేధాలు, మానసిక ఆందోళన పెరిగే సూచనలు.
పరిహారం: వెండిని దానం చేయండి, “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రం జపించండి.
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19):
వ్యక్తిగత, వృత్తిపరమైన మార్పులు. అధిక ఖర్చుల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తొచ్చు.
పరిహారం: నల్ల నువ్వులు లేదా నల్ల పప్పు (ఉదత్ దాల్) దానం చేయండి.
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18):
అధిక శక్తి, కెరీర్లో ఊహించని మార్పులు. వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి.
పరిహారం: నీలం రంగు దుస్తులు దానం చేయండి.
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20):
ఆత్మ పరిశీలనకు ఇదే సరైన సమయం. కెరీర్లో మరింత ఎదగాలంటే ఓపిక పట్టాలి.
పరిహారం: చేపల చెరువుల్లో పిండి పదార్థాలు వదలండి.
ఈ జ్యోతిష్య విశ్లేషణలు సాధారణమైనవే. వ్యక్తిగత జాతకం ఆధారంగా ప్రభావాలు మారవచ్చు. కాబట్టి సుదీర్ఘ పరిహారాల కంటే మంచి ఆచరణ సాధ్యమైన పరిహారాలను పాటించండి.