Elinati Shani: ఏలినాటి శనిదోషాలతో బాధపడుతున్నారా? శక్తివంతమైన పరిహారాలు మీ కోసం..!

bharatiyasampradayalu
Lord Shani

ప్రతీ ఒక్కరి జీవితంలో శనిదేవుడి ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఏలినాటి, సాడేసాతి, అర్ధాష్టమ శని వంటి దశలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.

శనిదేవుడు కర్మ ప్రభువు అయినందున మనం చేసిన కర్మల ప్రకారమే శిక్షలు లేదా ఫలితాలు ఇస్తారు.అందుకే పండితులు ఎల్లప్పుడూ మంచి పనులు చేయాలని, సన్మార్గంలో ఉండాలని సూచిస్తారు.

శనిదోషాల నుంచి ఉపశమనం పొందడానికి శనివారం కొన్ని పరిహారాలను పాటించడం చాలా కీలకం:

శనిదేవుడి సేవలు: శనివారం శుభ్రంగా స్నానం చేసి, స్వచ్ఛమైన బట్టలు ధరించి శని ఆలయానికి వెళ్లాలి.అక్కడ శనిదేవుడికి తైలాభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం.

వస్త్ర, నైవేద్యం సమర్పణ: శనిదేవుడికి నల్లని చిన్న వస్త్రం సమర్పించాలి. అలాగే నల్ల నువ్వులు, నల్ల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.

పశు, పక్షుల పూజ: కాకులు, నల్ల కుక్కలు, నల్ల చీమలకు చపాతీలు, చక్కెర, బెల్లం వంటి ఆహార పదార్థాలను అందించాలి. ఇది శనిదేవుడి అనుగ్రహాన్ని పొందేందుకు దోహదపడుతుంది.

సూర్యారాధన: శనిదేవుడి అనుగ్రహం కోరుతూ సూర్యనారాయణుడిని పూజించాలి.

స్తోత్రాలు పఠన: ప్రతిరోజూ శనిదేవుడి స్తోత్రాలు, శని అష్టోత్తర నామాలను చదవడం శ్రేయస్కరం.

శనిదేవుడి ప్రభావం: చాలామంది శనిదేవుడి ప్రభావం చెడు అని భయపడతారు. కానీ శనిదేవుడి అనుగ్రహం పొందిన వ్యక్తి కటిక పేదరికం నుంచి కూడా అపారమైన ఐశ్వర్యాన్ని పొందగలడు.<అందుకే పండితులు పై సూచించిన పరిహారాలను పాటించమని సలహా ఇస్తున్నారు.

శనిదేవుడిని సత్కరించి, ఆయన ఆశీర్వాదాన్ని పొందితే జీవితంలో శుభఫలితాలు అనుభవించవచ్చు.

Share This Article